Saturday, October 30, 2010

Jeevita SaTyamulu

1. సమస్యలను అవకాశాలుగా భావించి పురోగమించు.

2. ఆశావాద దృక్పథం కలిగివుండు.

3. నిన్ను ఇతరులు ఏవిధంగా గౌరవించాలని భావిస్తావో ఇతరులను నీవు అదే విధంగా గౌరవించు.

4.ప్రతి విషయాన్ని ఒకే కోణమునుంచి చూడకు.

5.ఇతరుల శక్తిని పెంపొందించదానికి నీవు దోహదకారివిగా వ్యవహరించు.

6.మనసిచ్చి మాట్లాడటం నేర్చుకో.

7. బహిరంగంగా మెచ్చుకో..ఏకాంతంగా మందలించు.

8. డబ్బును పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు. గడిచిన కాలాన్ని తిరగదోడలేము.

9. విజయం సాధించినపుడు నమ్రతగా వుండు- వైఫల్యాలకు అతిగా చలించవద్దు.

10. నీ కష్టసుఖాలను ఆత్మీయులతో పంచుకో.

11. పొగిడేవారి వలలో చిక్కుకోకు.

12. వ్యక్తిగత అవసరాలను నీవే తీర్చుకో.

13వీలైనంతవరకు ముఖాముఖి సంభాషణలద్వారా పనులు చేయడానికి ప్రయత్నించు.

14. అవును , కాదు అనడం కష్టం - ‘ చూద్దాం ’ అనడం సులభం.

15. శిక్షణ తర్వాత నీపనిలో అన్వయించుట ప్రారంభించు.

16. నీతో సన్నిహితంగా ఉన్నవారితోనేగాక ఇతరులతో కూడా సంబంధాలు పెంచుకో.

17. విశాలహృదయంతో కుతూహలం పంచుకొని నూతన రీతులలో వ్యవహరించటానికి ప్రయత్నించు.

18. అందరికి అందుబాటులో వుండు.

19. ఇతరుల విజయాలను హార్దికంగా అబినందించు.

20. మీ సంస్థను గురించి మాట్లాడేటపుడు ‘ నేను బదులు మేము ’ అని ప్రయోగించు.

21. నెరవేర్చలేని వాగ్దానాలు చేయవద్దు.

22. తెలియని దానిని తెలిసినట్లు నటించబోకు.
ఇతరులకు ఆదర్శంగా వుండడానికి కృషిచేయి.

24.పోటీని ఎపుడు తక్కువగా అంచనా వేయకు.

25. మెత్తనివారి నెత్తిన ఎక్కుతారు కాబట్టి కరుకుగా వ్యవహరించు.

26. సందేహం కలిగినపుడు నీ అంతర్‌జ్ఞానం ప్రకారం నడచుకో.

27. అరుదుగా వచ్చు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో.

28.తృప్తి, చొరవను కుంటు పరచకూడదు.

29.నీకు సహయం చేసినవారికి కృతజ్ఞతలు చెప్పడం మరచిపోకు.

30. స్వయంకృషి ద్వారానే మార్పు సాధ్యం.

31 ఆడంబరాలు తగ్గించుకో.

32. ప్రతి వైఫల్యం విజయానికి మెట్టని తెలుసుకో.

33. వెనుకకు తగ్గవలిసివస్తే అహాన్ని అడ్డురానీయకు.

34. నిరంతరం పురోగమించడానికి ఆలోచనలు , ప్రణాళికలు కొనసాగించు.

35. ప్రతిది జాగ్రత్తగా ఆలకించుతు ఉండు.

36. శక్తి సామర్ధ్యాలు కలిగి సాహసించేవారిని ప్రోత్సహించు.

37. నీవు చేయలేని పనిని ఇతరులను చేయమని ఒత్తిడి చేయకు.

38. ఎదుగుతున్నవారికి చేయి అందించు.

39. పని జరుగుతున్నచోట ఆహ్లాదకర వాతవరణాన్ని ప్రవేశపెట్టు.

40. పునశ్చరణ తరగతుల ద్వారా మాత్రమే అభివృద్ధిని కొనసాగించగలమని గుర్తించు.

41. అవసరాలు అందరికి వుంటాయని గుర్తించు.

42. తేలికగా చేయగల పనులను క్లిష్టతరం చేయవద్దు.

43. యాంత్రికతకు బానిసగా మారకు.

44. అహంకారాన్ని అభివ్యక్తం చేయకుండా బాధ్యతలను నమ్రతగా నిర్వహించు.

45. సమయబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించు.

46. నీ కార్యక్రమాలను శారీరక శక్తితో సమన్వయం చేసుకో.

47.ఆప్తులకు , సన్నిహితులకు అండగా నిలబడు.

48.వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నించు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.

49.విషయ పరిశీలనలో నిజాయితీగా వుంటూ పర్యవసానాన్ని గురించి ఆలోచించు.

50.నీవు చెప్పేదానిని ఆచరించు - ఆచరించేదానిని చెప్పు.